9న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండి
- పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పొన్నం ప్రభాకర్,
కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్, మార్చి 7 (విశ్వం న్యూస్) : ఈనెల 9న కరీంనగర్ లో జరిగే సభను విజయవంతం చేయడానికి గాను ముఖ్య నాయకులతో హాజరైన ఏఐసీసీ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ గార్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హాత్ సే హాత్ జోడొ యాత్ర కరీంనగర్ పార్లమెంటు పరిధి లోని హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, నియోజకవర్గాలలో విజయవంతంగా పూర్తి చేసుకుని ఈనెల 9న కరీంనగర్ నియోజకవర్గం లో పాదయాత్ర జరగనున్నందున సాయంత్రం నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే అంబేద్కర్ స్టేడియం నుండి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి, పార్లమెంటులో అన్ని పార్టీలను ఒప్పించి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ అని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లేలా ఈ సభ వేదికను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
ఇట్టి సభకు చత్తీస్గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బగెల్ ,మరియు మాజీ ముఖ్య మంత్రులు, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావు టక్రే, కొప్పుల రాజు, రోహిత్ చౌదరి, జై రామ్ రమేష్, ఏఐసిసి సభ్యులు, ఏఐసీసీ నాయకులు, పిసిసి సభ్యులు, పీసీసీ నాయకులు, మాజీ మంత్రులు ,మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, హాజరవుతారని అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ,అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పక్షాన కోరుచున్నాము అని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి నాయకులు వైద్యుల అంజన్ కుమార్,డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు పడాల రాహుల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి ,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, బీసీ సెల్ అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్, ఎస్ టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్ ,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్, నిహాల్, పోరండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.