జూనియర్ లైన్ మెన్ పరీక్షల్లోనూ అవకతవకలు

జమ్మికుంట/హైదరాబాద్, జూన్ 7 (విశ్వం న్యూస్) : టి.ఎస్.పి.ఎస్.సి బోర్డ్ పరీక్షల్లో నే కాదు ఇతర బోర్డ్ పరీక్షలలోనూ అవకతవకలు జరిగాయని ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షులు (ఏ.ఐ.సి.సి మెంబర్, హుజురాబాద్ నియోజకర్గ ఇంచార్జ్ ) బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎస్.పి.డి.సి.ఎల్ బోర్డ్ పరిధిలోని జూనియర్ లైన్ మెన్ పరీక్షలలోనూ అక్రమాలు జరిగాయని వెల్లడించారు.

టి.ఎస్.పి.ఎస్.సి బోర్డ్ పరీక్షల లీకేజిలో డి.ఈ రమేష్ ప్రమేయం ఉందని సిట్ అధికారులు చెప్తున్నారని, డి.ఈ రమేష్ పేపర్ లీక్ చేసింది టి.ఎస్.సి.పి.ఎస్.సిలోనా లేక ఎస్.పి.డి.సి.ఎల్ లోనా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యగులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పరీక్షలు నిర్వహించడం లేదని మండిపడ్డారు.పేపర్ లీకేజి అయినా… మాస్ కాపీయింగ్ అయినా బయటపెట్టకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారని ప్రభుత్వానికి చురకలంటించారు.

ఓకే సెంటర్ లో ఎక్కువ మంది ఎలా పాస్ అయ్యారో…
ఎస్.పి.సి.సి.ఎల్ బోర్డ్ పరిధిలో గత సంవత్సరం జులై 17వ తేదీన జూనియర్ లైన్ మెన్ పరీక్షలు జరిగాయని, ఈ సంవత్సరం పిబ్రవరి 2 మరో నోటిఫికేషన్ ఇచ్చారని బల్మూరి వెంకట్ గుర్తు చేశారు. మొత్తం 1755 లైన్ మెన్ పోస్టులకు 60 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే 50 వేల మంది నిరుద్యోగులు పరీక్షలు రాశారని వెంకట్ చెప్పారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కీసరలోని గీతాంజలి సెంటర్లో 700 మంది జూనియర్ లైన్ మెన్ పరీక్ష రాస్తే అందులో 92మంది పాస్ అయ్యారని బల్మూరి వెంకట్ అన్నారు. కీసర లోని గీతాంజలి సెంటర్లో మొదటి బ్లాక్ లోనే 92 మందికి 40కి పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఇటువంటి అక్రమాలు బయట పడకుండా ఓ.టి.పి సిస్టమ్ తీసుకువచ్చారని, డి.ఈ రమేష్ అక్రమాలు బయట పడటంతో హడావుడిగా జూనియర్ లైన్ మెన్ ల ఫలితాలు వెల్లడించారని ఆరోపించారు.

అన్ని బోర్డ్ ల లింకులు బయట పడతాయని తెలంగాణ ప్రభుత్వం బయపడుతోందని విమర్శించారు. ఎస్.పి.డి.సి.ఎల్ బోర్డ పరీక్షలో అవకతవకలు జరిగినా బయటపెట్టడం లేదని అన్నారు. పేపర్ లీకేజి అంశాన్ని ఒక టి.ఎస్.పి.ఎస్.సికే అంకితం చేసి చేతులు దులుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తుందని బల్మూరి వెంకట్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *