దశాబ్ది ఉత్సవాలను
వైభవంగా జరుపుకోవాలి
రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, ఎమ్మెల్యే డా.రసమయి
తిమ్మాపూర్, మే 22 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మానకొండూర్ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకి షన్ పిలుపు నిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణారావు తో పాటు మాన కొండూర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటీసీ లు, బీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో దశాబ్ది ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా ప్రతినిధుల సమావేశంలో డా.రసమయి మాట్లా డుతూ…ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సార థ్యంలో తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకొని అద్భు తంగా ముందుకు సాగుతున్న శుభ సందర్భంలో జూన్ 02 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్స వాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోష కరమన్నారు. ఇందులో భాగంగా మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో దశాబ్ది వేడు కలను అత్యంత వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా మండల కేంద్రాలలో దూందాం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అనేక ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం తాగు ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, ఇందులో ప్రజలు భారీ సంఖ్య లో భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే రసమయి ప్రజలకు పిలుపు నిచ్చారు.