16 డివిజన్ శ్రీ పోచమ్మ తల్లికి బోనం
సమర్పించిన మేయర్, కార్పొరేటర్
- మేయర్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్
- శ్రీపాద ఇంక్లెవ్ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, సమ్మిరెడ్డి
- విష్ణుపురి కాలనీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి హాజరు
పీర్జాదిగూడ, జూలై 17 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ శ్రీ బంగారు పోచమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల సందర్భంగా బంగారు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్న శ్రీపాద ఇంక్లేవ్, విష్ణు పురి కాలనీ ప్రజలు. ఈ కార్యక్రమం జంట కాలనీల అధ్యక్షులు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, వేముల ఉమామహేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్, జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ భోగంపాడు సమ్మిరెడ్డి లు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొని డప్పుల దరువుతో భారీ ర్యాలీగా బయలుదేరి అమ్మవారికి ఐదు ప్రదక్షణ చేసి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు బోనాల మొక్కులు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బోనాల సందర్భంగా అమ్మవారి కటాక్షంతో భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రం, పీర్జాదిగూడ ప్రజలందరికీ ఎలాంటి భయంకర వ్యాధులు గాని అనారోగ్యాలు గాని రాకుండా ప్రజలందరూ సుఖ శాంతులతో, చిరునవ్వుతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు, ప్రత్యేక బోనాలు సమర్పించినట్లు వెల్లడించారు.
జంట కాలనీల అధ్యక్షుల రఘువర్ధన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన మేయర్ వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన జంట కాలనీ కమిటీలు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పీర్జాదిగూడ ప్రజలకు 16 డివిజన్ ప్రజలకు శ్రీ బంగారు బోనాల పండుగ సధర్భంగా బంగారు మైసమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విష్ణుపురి కాలనీ ప్రధాన కార్యదర్శి పాండు, 16వ డివిజన్ ప్రజలు, జంట కాలనీల కమిటీ నాయకులు, ప్రజలు, యువత, మహిళలు తదితరులు హాజరయ్యారు.