నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

నిరుద్యోగుల జీవితాలతోచెలగాటం

  • టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను వెంటనే విధులనుండి తొలగించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి – ఎండి సాహెబ్ హుస్సేన్

వీణవంక, మార్చి 16 (విశ్వం న్యూస్) : ఈ రోజు వీణవంక మండల కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ ప్రభుత్వం నిరుద్యోగులపై ఉన్న నిర్లక్షణికి నిదర్శనం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం నీళ్లు, నిధులు, నియామకాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ యువకుల నోట్లో మట్టి కొడుతుందని అన్నారు. ఉద్యోగం కోసం ఊర్లు విడిచి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసి భూములు ఇంటిస్థలలు అమ్ముకొని ఫీజులు కట్టి ప్రిపేర్ అవుతున్న యువకులు ఇటువంటి లీకేజీ వ్యవహారాల వల్ల వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నదని అన్నారు. గతంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం లో తప్పులు జరిగి 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వానికి కనీసం సోయులేదని తెలంగాణ వచ్చిన తరువాత ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివిధ ఫోటి పరీక్షల లీకేజీ ఎక్కువ అయ్యాయని చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించడంలేదని అన్నారు. ఒక చిన్న స్థాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే పై అధికారులు ఇంకెన్ని తప్పులు చేస్తున్నారో ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి లీకేజీ వ్యవహారంలో ఉన్న అధికారులను టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ని సభ్యులను విధుల నుండి తొలగించి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉచిత కోచింగ్ సెంటర్లు తెరచి వారికి శిక్షణ ఇవ్వాలని లేకపోతే నిరుద్యోగుల పట్ల కాంగ్రేస్ పార్టీ గా తాము అండగా ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, గుంపుల గట్టయ్య, రంజిత్ రాచపల్లి కుమార్, ఎం.డి అన్వర్, ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *