వొడితల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

హుజూరాబాద్, జూలై 24 (విశ్వం న్యూస్) : రాజేశ్వర రావు విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాజేశ్వర రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో తన వ్యాసాల్లో వివరించేవారని మంత్రి హరీష్ రావు గుర్తు చేసారు. హుజూరాబాద్ లో మరో కీలక ఘట్టానికి మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ పట్టణంలో మాజీ ఎంపీ వొడితల రాజేశ్వరరావు విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు.

ఈ కార్యక్రమంలో విప్ పాడి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పి వి నరసింహరావు హయాంలో వెలుగు వెలిగిన నాయకుడని, హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రులు కొనియాడారు.