ఆర్మీ జవాన్ అనిల్‌ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

ఆర్మీ జవాన్ అనిల్‌ మృతిపట్ల
మంత్రి కేటీఆర్ సంతాపం

  • మృతిని కుటుంబాన్ని పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, బీఆర్ఎస్ నాయకులు

కరీంనగర్ బ్యూరో, మే 5 (విశ్వం న్యూస్) : జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, నియోజక వర్గ బారాస నాయకులు దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌ కిస్త్వార్‌ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయిందని ఆ ముగ్గురిలో అనిల్‌ మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్టు తెలిసింది. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్యకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు అనిల్‌ 2011లో సైన్యంలో చేరి టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు.

అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్‌, అరవ్‌ ఉన్నారు. అతని మృతితో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజక వర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *