మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఒపల్ సుచత

మిస్ వరల్డ్ 2025 విజేతగా
థాయిలాండ్ సుందరి ఒపల్ సుచత

హైదరాబాద్, మే 31 (విశ్వం న్యూస్): ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్-2025 టైటిల్‌ను థాయిలాండ్‌కు చెందిన అందాల భామ ఒపల్ సుచత దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రశ్రేణి అందగత్తెల మధ్య జరిగిన తుది పోటీలో ఆమె తన సౌందర్యం, ప్రతిభ, సమాజ సేవా దృక్పథంతో హత్తుకునే ప్రదర్శన ఇచ్చి విజేతగా నిలిచింది.

ఈ విజయంతో పాటు ఆమెకు రూ. 8.5 కోట్ల విలువైన ప్రైజ్ మనీ అందనుంది. థాయిలాండ్‌కు ఇది గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది.

ఫైనల్‌ రౌండ్‌లో టాప్‌ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీళ్ల నలుగురిని అడిగిన ప్రశ్నలు అడగగా.. అందులో అత్యున్నత సమాధానం చెప్పిన థాయ్‌లాండ్‌కు బ్యూటీ మిస్ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024 మిస్‌ వరల్డ్‌ విజేత క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ఓపల్ సుచాతకు ధరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *