
- వివాహేతర సంబంధం కలకలం
- యువకుడితో మహిళ సంబంధం..
- స్థానికుల ఆగ్రహం
పెద్దపల్లి, జూన్ 1 (విశ్వం న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అశోక్‌నగర్‌లో ఒక వివాహేతర సంబంధం కలకలం రేపింది. ఫేస్‌బుక్ పరిచయం ద్వారా యువకుడితో సన్నిహితంగా మారిన ఒక మహిళపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే, అశోక్‌నగర్‌లో నివాసముండే మౌనిక అనే మహిళకు, భూపాలపల్లి జిల్లాకు చెందిన స్వామి అనే యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆత్మీయతగా మారి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఇటీవల మూడు రోజులుగా స్వామి మౌనిక ఇంట్లో ఉండటం గమనించిన స్థానికులు, వారిని తాడుతో కట్టి బహిరంగంగా నిలబెట్టారు.
ఇదే సందర్భంలో యువకుడికి స్థానికులు “దేహ శుద్ధి” చేశారని సమాచారం. అనంతరం, ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
సమాజంలో ఇటువంటి సంఘటనలు మానవ హక్కులపై ప్రశ్నలు వేసేలా ఉన్నాయి. ఇకపోతే, సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతున్న సంబంధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.