పిఆర్టియు బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి ప్రచారం

పీర్జాది గూడ,, పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : మేడిపల్లి మండలం పీర్జాది గూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో ఆదివారం పీఆర్ టీయూ టీఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం పీఆర్ టీయూ మేడిపల్లి మండల శాఖ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, మేడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్,ఘట్కేసర్ మండల అధ్యక్షుడు రాంనాథ్ రెడ్డి, జిల్లా బాధ్యులు రాజిరెడ్డి, మాజీ అధ్యక్షులు రాంచందర్, సైది రెడ్డి, హరి శంకర్, వెంకటేశం టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.