- అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ..
హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం బుధవారం (జనవరి 17) ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసింది.
నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగుస్తుండటంతో ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందని భావించగా.. చివరి నిమిషంలో జాబితా నుంచి ఆయన పేరు ఎగిరిపోయింది.