మోదీ 3.0: కొత్త క్యాబినెట్‌లో మంత్రిపదవులు దక్కింది వీళ్లకే

మోదీ 3.0: కొత్త క్యాబినెట్‌లో
మంత్రిపదవులు దక్కింది వీళ్లకే

హైదరాబాద్, జూన్ 9 (విశ్వం న్యూస్) : వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆయనతో పాటు తొలి విడతలో 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో 78 నుంచి 81 మందికి అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 30 మందిని మాత్రమే తీసుకున్నట్టు తెలిపాయి.

బీజేపీ నుంచి అమిత్‌ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, పియూష్ గోయల్, కిరణ్ రిజుజులకు క్యాబినెట్‌ బెర్తులు ఖాయమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌లాల్‌ ఖట్టర్, సర్బానంద సోనోవాల్‌లకు మంత్రివర్గంలో చోటు లభించింది. వీరితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు చోటుదక్కింది.

తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీడీపీకి రెండు పదవులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను సహాయ మంత్రి పదవి వరించింది.

నరేంద్ర మోదీ (ప్రధాన మంత్రి)
అమిత్ షా
రాజ్నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
ఎస్ జైశంకర్
పీయూష్ గోయల్
ప్రహ్లాద్ జోషి
జయంత్ చౌదరి
జితన్ రామ్మాంఝీ
రామ్నాథ్ ఠాకూర్
చిరాగ్ పాశ్వా న్
హెచ్డీ కుమారస్వా మి
జ్యో తిరాదిత్య సింధియా
అర్జున్ రామ్ మేఘవాల్
ప్రతాప్ రావ్ జాదవ్
రక్షా ఖడ్సే
జితేంద్ర సింగ్
రాందాస్ అథవాలే
కిరణ్ రిజుజు
రావ్ ఇంద్రజీత్ సింగ్
శంతను ఠాకూర్
మన్సుఖ్మాండవియా
అశ్వి ని వైష్ణవ్ష్ణ
బండి సంజయ్
జి కిషన్ రెడ్డి
హర్దీప్ర్దీ సింగ్ పూరి
బి ఎల్ వర్మ
శివరాజ్ సింగ్ చౌహాన్
శోభా కరంద్లాజే
రవ్నీత్ సింగ్ బిట్టు
సర్బా నంద సోనోవాల్
అన్నపూర్ణా దేవి
జితిన్ ప్రసాద్
మనోహర్ లాల్ ఖట్టర్
హర్ష్ మల్హోత్రా
నిత్యా నంద రాయ్
అనుప్రియాపటేల్
అజయ్ తమ్తా
ధర్మేం ద్ర ప్రధాన్
నిర్మలా సీతారామన్
సావిత్రి ఠాకూర్
రామ్మోహన్ నాయుడు కింజరాపు
చంద్రశేఖర్ పెమ్మసాని
మురళీధర్మొహల్
కృష్ణపాష్ణ ల్ గుర్జర్ర్జ
గిరిరాజ్ సింగ్
గజేంద్ర సింగ్ షెకావత్
శ్రీపాద్ నాయక్
సి.ఆర్.పాటిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *