తారకరత్నపరిస్దితి విషమం
ఆసుపత్రికి కుటుంబ సభ్యులు
బెంగళూరు, పిబ్రవరి 18 (విశ్వం న్యూస్) : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు మరోసారి ఆయనకు బ్రెయిన్ స్కాన్ చేశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. తారకరత్న పరిస్థితి తెలిసిన వెంటనే నందమూరి కుటుంబసభ్యుల తో పాటు బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు.