జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

  • అరోరా టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో
  • విద్యార్థులను అభినందించిన ట్రాఫిక్ సిఐ సామ్సంగ్ జోసెఫ్
  • కళాశాల డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు హాజరు

పీర్జాదిగూడ, మార్చి 13 (విశ్వం న్యూస్) : జాతీయ భద్రత వారోత్సవాలలో భాగంగా పర్వతాపూర్ లోని ఆరోరా టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాలేజీ స్టూడెంట్ ఆక్టివిటీ కమిటీ కం సేఫ్టీ క్లబ్ ఉప్పల్ ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో ఉప్పల్ క్రాస్ రోడ్స్ వద్ద వాహనాలను నడిపేవారు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ అనుగుణంగా ముందుకి వెళ్తూ పక్క వాహనానికి ఇబ్బంది కలగకుండా వాహనాలు నడపాలని తెలిపారు.

మరొక ఇన్స్పెక్టర్ శాంసన్ జోసెఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారు హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని, త్రిబుల్ రైడింగ్ కి పాల్పడకూడదని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీకాంత్ జట్ల మాట్లాడుతూ భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన స్టూడెంట్ ఆక్టివిటీ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సేఫ్టీ క్లబ్ కో ఆర్డినేటర్ ఫరానా, కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *