ఘనంగా గణనాధుని
నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విశ్వం న్యూస్) : శ్రీ గణనాధుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ హైమావతినగర్-మోతినగర్ వారు ఏర్పాటు చేసిన మందిరం కార్యక్రమంలో ముందుగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ డా. గూడూరి చెన్నారెడ్డి, డా.బి.కె. గూడూరు విజయలక్ష్మి, చింతపల్లి శోభ రెడ్డి కమిటీ సభ్యులతో, విచ్చేసిన అతిధుల సమక్షంలో దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు శ్రీ గణనాధుని దర్శించుకున్నారు.
శ్రీమతి చింతపల్లి శోభా రెడ్డి స్నేహితం ట్రస్ట్ చైర్ పర్సన్ తన శిష్య బృందముల చేత కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వర్తించడం ఆహుతులను ఆకట్టుకున్నది. ఎం సుబ్బారావు, శ్రీనివాసులు వారి సతీమణితో కలిసి ఆలపించిన భక్తి గీతాలు, పుచ్చ రాజ్యలక్ష్మి శిష్య బృందంతో చేసిన సంగీత కచేరి శ్రోతలను ఆకట్టుకుంది. అందులో ముఖ్యంగా మాస్టర్ గూడూరి వన్ రాజు రెడ్డి చేసిన నృత్యం హైలైట్ గా నిలిచింది, తనిష్క యోగ, శ్రీ తావీష్ జాహ్నవి చేసిన నృత్యాలకు ప్రాంగణం మొత్తం కరతాల ధనులతో మారుమ్రోగింది. కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్యులకు, నృత్య కళాకారులకు శాలువాలు, మెమొంటోళ్లు ఇచ్చి ఘనంగా సన్మానించారు.
- హైమావతి నగర్ భగత్ సింగ్ నవ యువత అసోసియేషన్ మెంబర్స్ వారు ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహమునకు డా. గూడూరి చెన్నారెడ్డి, డా.బి.కె. విజయలక్ష్మిలను ఆహ్వానించి సంయుక్తంగా శాలువాతో ఘనంగా సత్కరించి భగవద్గీత గ్రంథమును ప్రధానం జేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వి రాధాకృష్ణ సతీమణి శోభ, సి. వెంకట దాసు, కమిటీ మెంబర్లు కె.ఎచ్.ఎస్. శర్మ, జి. శ్రీనివాస్, డి.రవి గౌడ్, డి. శ్రీనివాస్, జి. శ్రీధర్ రెడ్డి, జి. మహేందర్ రెడ్డి, గణేష్, శంకర్, జి. అనురాధ, డి. రాధిక తదితరులు పాల్గొన్నారు.