పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

పాఠశాల నూతన భవనాన్ని
ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

స్థానిక కార్పొరేటర్ బొడిగె స్వాతికృష్ణ గౌడ్
ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం
పీర్జాదిగూడ, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపురం 5వ డివిజన్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10గంటలకు పర్వతాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అదనపు తరగతి గదులను, డిజిటల్ క్లాస్ రూమ్ లను సుమారుగా రూ. 64 లక్షల వ్యయంతో(మింట్ కాంపౌండ్ సంస్థ వారి సహకారంతో) మున్సిపల్ నిధులతో నిర్మించిన అదనపు భవనాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ బోడిగే స్వాతి కృష్ణగౌడ్ లు సభ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్ జక్కా వెంక రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణ, మింట్ కాంపౌండ్ చీఫ్ జనరల్ మేనేజర్ నాయుడు, జనరల్ సెక్రెటరీ కృష్ణమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద,అధ్యాపకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు,డివిజన్ నాయకులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థి, విద్యార్థినీలు, తల్లిదండ్రులు, బిఎస్ కేజీ యువసేన తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసిన స్థానిక కార్పొరేటర్ బొడిగే స్వాతి కృష్ణగౌడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *