సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలను ఫిబ్రవరి 2లోగా తెలియజేయాలి

సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలను ఫిబ్రవరి 2లోగా తెలియజేయాలి

జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి
పెద్దపల్లి, జనవరి 27 (విశ్వం న్యూస్): ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ -2, ఇతర క్యాటగిరి లకు చెందిన తాత్కాలిక సీనియారిటి జాబితాను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జిల్లా వెబ్సైట్, జిల్లా విద్యా శాఖ అధికారి వెబ్సైట్లలో ఉంచనైనదని, సీనియారిటి జాబితాలో తేడాలు, అభ్యంతరాలు ఉన్నట్లయితే అట్టి విషయాన్ని ఫిబ్రవరి 2లోగా జిల్లా విద్యా శాఖ అధికారి గారికి తెలియజేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి నేడోక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు, ప్రధానోపా ధ్యాయులు స్పెషల్ కేటగిరిలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ కొరకు దరఖాస్తు చేసుకోదలచు కున్నట్లయితే, అట్టివారికి స్పెషల్ మెడికల్ బోర్డు, పెద్దపల్లిలో ఈ నెల 27 నుండి 30 వరకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని అందరూ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని సరైన ధృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా డిఇఓ డి. మాధవి ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *