నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా… అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పగడ్భందీ చర్యలు

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా… అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పగడ్భందీ చర్యలు

-పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ

కరీంనగర్, డిసెంబర్ 30 (విశ్వం న్యూస్) : నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సరం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు.

నేటి (శనివారం) ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు తనిఖీలు
శ్రుతిమించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం రాత్రి నుండి బ్రీత్ అనలైజర్లతో డ్రంకెన్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కమిషనరేట్వ్యప్తంగా నియమనిబంధనలు ఉల్లఘించేవారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రత్యేకంగా డ్రంక్ఇవ్ల నిర్వాహణకు ప్రత్యేక మైబైల్ బృందాలను ఏర్పాటు చేసి రేయింబవళ్ళు తనిఖీలను |కొనసాగించనున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని | హెచ్చరించారు. వాహనాల సైలెన్సర్లు తొలగించి శబ్దకాలుష్యం కలిగించడం పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంగా, నిర్లక్ష్యంగా, ముగ్గురు అంతకంటే ఎక్కువ మందితో ద్విచక్ర వాహనాల పై వెళ్ళే వారి వాహనాలను సీజ్ చేయడం, విధించబడిన ఈ చలాన్లు చెల్లించకుండా సంచరించే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.

మైనర్లకు వాహనాలిచ్చే వాహనదారులపై కేసుల నమోదు చేస్తాం
మైనర్లకు వాహనాలిచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రోడ్డునియమ నిబంధనల్లో భాగంగా మైనర్లకు వాహనాలిచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేయడంతోపాటు సదరు మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లకు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కమిషనరేట్ వ్యాప్తంగా కదలికలపై సిసి కెమెరాలతో నిఘా
నూతన సంవత్సరం వేడుకలను చిత్రీకరించేందుకు నగరంలో ఇప్పటికే ఉన్న వేలాది సిసి కెమెరాలతోపాటు అదనంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని కమీషనరేట్ పరిధిలో 50 వీడియో చిత్రీకరణ బృందాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించనున్నాము. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారితోపాటు రోడ్డు నియమ నిబంధనలు పాటించని వాహనచోదకుల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. రోడ్ల పైన కత్తులు, తల్వార్లతో కేకలు కట్చేయడం, రోడ్లపై సౌండ్స్పిస్టమ్లతో నృత్యాలు చేయడం,రంగులు చల్లుకుంటూ రోడ్లపై వెళ్ళే ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటివి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేసులపాలై జీవితాలను వృధాచేసుకోవద్దు
విచ్చలవిడిగా రోడ్ల పైకి వచ్చి ర్యాలీలుగా వెళ్ళడం, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపడం, ప్లేట్ ట్యాంపరింగ్ లాంటి చర్యలకు పాల్పడే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఒకసారి కేసునమోదై పోలీస్ రికార్డుల్లోకి ఎక్కితే యువత ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవని, అనవసరంగా నియమనిబంధనలు విస్మరించి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రుల ఆశయాల సాధనకోసం క్రమశిక్షణతో ముందుకుసాగితేనే జీవితంలో సఫలీకృతం అవుతామనే విషయాన్ని యువత గుర్తించాలని చెప్పారు. గతంలో పోలీసు కేసులు నమోదైన వారు ఇప్పుడు ఎక్కడా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించక దుర్భరస్థితిలో కొనసాగుతున్నారని తెలిపారు.

పొంచి ఉన్న కోవిడ్ ప్రాణాంతకం
ప్రాణాంతకమైన కోవిడ్ వ్యాప్తి పొంచిఉన్నందున ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించడంతోపాటు, వైద్యుల సలహాలు,సూచనలు పాటించాలని కోరుతున్నాము. జనసమూహంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రాణాంతకమైన కోవిడ్ బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే చర్యలను పాటించడం తమభాద్యతగా అన్నివర్గాల ప్రజలు గుర్తించాలని చెప్పారు. ఆదివారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగనున్నాయి.

షీ బృందాలతో గస్తీ ఏర్పాటు
మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోకిరీలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కంటికి కనిపించని రీతిలో ఉండే అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నామని, ఇందులో నిక్షిప్తమైన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టి పోకిరీలను శిక్షలు విధించబడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. షీటీం బృందాలు కూడా మఫ్టీలో సంచరించనున్నాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారం అందజేయాలని కోరుతున్నాము.

31 రాత్రి నుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నేటి(శనివారం) రాత్రి నుండి జనవరి 01వ తేది ఉదయం 6గంటల వరకు కరీంనగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్ళింపు చర్యలు కొనసాగనున్నాయి.. 31న రాత్రి 8గంటల నుండి ఉదయం 6గంటల వరకు భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని తెలిపారు.

– వి సత్యనారాయణ ఐపిఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్-కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *