బిఎల్ సంతోష్ అడ్డంగా దొరికిన దొంగ

బిఎల్ సంతోష్ అడ్డంగా దొరికిన దొంగ

కరీంనగర్, డిసెంబర్ 30 (విశ్వం న్యూస్) : స్వామీజీలతో కలిసి బిఎల్ సంతోష్ అడియో సాక్షిగా అడంగ దొరికినాడు. అరెస్టు చేయవద్దని కొట్టుకుపోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అతని ఎలాంటి తప్పు చేయనప్పుడు 41 సి ఆర్ పి కింద నోటీసులు ఇస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండే. టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే బిఎల్ సంతోష్ హైదరాబాదులో తీసిన వ్యాఖ్యలు ఆయన తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా బిఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కనుగోలు విషయంలో జైలుకు వెళ్లక తప్పదు. బిజెపి కనుసన్నల్లో ప్రభుత్వాలను కూల్చే బాధ్యతను బిఎల్ సంతోష్ భుజాన వేసుకున్నాడు అందులో భాగమే మహారాష్ట్ర గోవా మధ్యప్రదేశ్ మణిపూర్లలో వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలనుకొన్నారు. బి . ఎల్ సంతోష్ దేశం కోసం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొడుతున్నా సమాధానం చెప్పాలి. తెలంగాణలో కూడా అదే చేయబోయి బిఎల్ సంతోష్ మరియు భారతీయ జనతా పార్టీ అడ్డంగా దొరికిపోయింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిఎల్ సంతోష్ బండారాన్ని బయట పెట్టారు. జాతీయ స్థాయిలో బిజెపి ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కానీ కెసిఆర్ గారు వీళ్ళ బాగోతం మొత్తం దేశం ముందు బయటపెట్టారు. దేశ ప్రజల నుండి దోచుకున్న డబ్బులతో వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలనుకుంటున్నారు. దేశం మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారు చివరకు వ్యవసాయాన్ని కూడా వారికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేసి పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఏం ఉద్ధరించారని మీకు మళ్లీ బిజెపికి ప్రజలు ఓట్లు వేయాలి.దేశానికి ఇప్పుడు కావాల్సింది తెలంగాణ మోడల్. గుజరాత్ మోడల్ కాలం చెల్లింది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శం భారతదేశంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు రావాలి. టిఆర్ఎస్ పార్టీని దేశం మొత్తం మంచి ఆదరణ లభిస్తుంది కేసీఆర్ నాయకత్వంతోనే ఈ దేశం ముందుకు వెళుతుంది.ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేష్, సాదవేణి వినయ్, కెమసారం తిరుపతి, తోట మదు, దండబోయిన రాము, శ్రీరాముల శ్రీకాంత్, కొమ్మిడి తిరుమల, నర్సయ్య, శ్రీరాముల రమేష్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *