ఎంపీగా గెల్పించాల్సింది పొన్నం ప్రభాకర్ ని మాత్రమే
మల్యాల సుజిత్ కుమార్, డీసీసీ ఉపాధ్యక్షులు కరీంనగర్
కరీంనగర్, జనవరి 11 (విశ్వం న్యూస్) : కరీంనగర్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ ని ఉదహరిస్తూ తదుపరి ఎంపీ వినోద్ కుమార్ అని ప్రకటించడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్. అంటే బండి సంజయ్ పని చేయకపోతే వినోద్ ని గెలిపించాలా అసలు ఈ వినోద్ ఎక్కడి నుండి వచ్చాడు అని ప్రశ్నించారు. కరీంనగర్ కి అసలు సిసలు నిఖార్సైన ఎంపీ పొన్నం ప్రభాకర్ మాత్రమే అని అన్నారు. ఇంకా చెప్పాలి అంటే పొన్నం ప్రభాకర్ ని అన్ని పార్టీ లు బలపరచి ఏకగ్రీవంగా పార్లమెంట్ కి పంపాలి అలా చేస్తేనే తెలంగాణ ఉద్యమకారునికి తెలంగాణ బిల్లు కోసం ఆయన చేసిన కృషికి గౌరవం ఇచ్చినట్లవుతుంది అన్నారు.
పొన్నం ప్రభాకర్ ఎంపీ గా కరీంనగర్ కి వేల కోట్ల పనులని తీసుకువచ్చిన గొప్ప నేత అని, తెలంగాణ ఉద్యమ సమయంలో అటు ఉద్యమాన్ని బలపరుస్తూ పార్లమెంట్ లో అత్యధిక శాతం అటెండన్స్ కలిగిన నేతల్లో ఒకరని గుర్తు చేశారు. ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన బిడ్డగా బీసీ స్టడీ సర్కిల్ ని, కేంద్రీయ విద్యాలయాలని, ఎస్సి హాస్టల్స్ లో మెరుగైన వసతులని కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ సామాన్య ప్రజలకి అందించారన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికి ప్రతి గ్రామంలో మనకు కనబడతాయని కరీంనగర్ పట్టణంలో పాసుపోర్టు సేవ కేంద్రం, తిరుపతి రైలు సౌకర్యం ఆయన చేసిన పనుల్లో కొన్ని ఉదాహరణలని అన్నారు.
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మానకొండూర్, చొప్పదండి, హుజురాబాద్, హుస్నాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా, పొన్నం ప్రభాకర్ ని ఎంపీ గా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు మల్యాల సుజిత్ కుమార్.