శుక్రవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా విపక్షాల బల ప్రదర్శన
జంతర్ మంతర్ వద్ద జరగనున్న ఎమ్మెల్సీ కవిత దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు
ఢిల్లీ, మార్చి 9 (విశ్వం న్యూస్) : శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్లపై ధర్నాకు కవిత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. హాజరుకానున్న 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళహక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతల ప్రాతినిధ్యం. దీక్షకు సంఘీభావం తెలపనున్న పలువురు కీలక నేతలు. దీక్షకు హాజరై సంఘీభావం తెలపనున్న బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు.