వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన
ఉద్యోగుల వేతన సవరణ నివేదిక
- పిఆర్సి కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ కు కలిసి 2 వేతన సవరణ నివేదిక సమర్పించిన టి సి టి ఎన్జీవో సంఘం అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : శనివారం రోజున తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషన్ గా నియమించిన N శివ శంకర్ ఐఏఎస్ కి మరియు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ శ్రీమతి కే సునీతకి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, జనరల్ సెక్రెటరీ ఎస్.కె జలాలుద్దీన్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ప్రభాకర్ ,రమేష్, అజయ్ అజయ్ కుమార్ మరియు సయ్యద్ సుజాత అలీ, సెక్రటరీ పంజాగుట్ట డి జగన్నాథ్, సయ్యద్ మొహినుద్దీన్, హసన ఉద్యోగ సంఘాలు కలిసి 2023 తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన రెండవ పి ఆర్ సి కమిటీకి సంబంధించినటువంటి ప్రతిపాదనను 51 పేజీల నివేదిక సమర్పించడం జరిగింది.
ముఖ్యంగా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల పే స్కేల్స్ కన్నా అదనంగా రెండు ఇంక్రిమెంట్ జారీ చేయాలని అదే విధంగా సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ని సీనియర్ ఇన్‌స్పెక్టర్గా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ని జూనియర్ ఇన్‌స్పెక్టర్ గా మరియు ఈ డిపార్ట్మెంట్లో లా డిగ్రీ కలిగినటువంటి శాఖ ఉద్యోగస్తులకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ను 45% హిట్ Fitment ఇవ్వాలని, మిగతా వివరాలన్నీ ఆ నివేదికలో పూర్తిగా నివేదించడం జరిగింది. దీనికి పిఆర్సి కమిషనర్ ఎం శివశంకర్ స్పందించి మీ శాఖకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు.
మా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంతో అన్ని సమస్యలపై చర్చించినందుకు మా సంఘం పక్షాన సంఘం అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించిన పిఆర్సి నివేదిక కాపీని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ శ్రీమతి కే సునీతకు అందజేయడం జరిగింది.