అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ పెట్టాలి

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ పెట్టాలి

బోడుప్పల్, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పైన అనుషిత వాక్యాలు చేసిన హమారా ప్రసాద్ మీద పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సంఘం తరఫునుంచి డిమాండ్ చేసున్నాము. ఈరోజు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారికి బాలాజీ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినటువంటి గొప్ప సంఘసంస్కర్త ఆ యొక్క నాయకుని పై మతోన్మాదులు రెచ్చిపోయి అంబేద్కర్ మీద ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినందువల్ల మా మనోభావాలు దెబ్బ తిన్నాయని మేము చాలా బాధపడుతున్నాను. అయితే ఈ రాష్ట్రంలో మతం పేరా కులాల పేరా మనుషులను విడగొట్టి చూస్తున్నటువంటి ఈ మతబిచ్చిగాళ్లు మత రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక హెచ్చరిక అంబేద్కర్ సంబంధించి మరో మారు అంబేద్కర్ పైన ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ వారసులం గా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాడు మతము మనుషుల మధ్య చిచ్చుపెట్టి మనుషులను దూరంగా ఉండేటట్టు చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల మీద మనమంతా జాగ్రత్త ఉండాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే భారత దేశంలో రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన మరో మారు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అంబేద్కర్ రిస్ట్ లు ఆయన అంబేద్కర్ వారసుల అందరు కూడా ఈ ఇలాంటి వ్యక్తుల పైన అప్రమత్తంగా ఉండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ సంఘ నాయకునిగా ఈ సందర్భంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన్నగల్ల కుమార్, ప్రదన కార్య దర్శి చీరాల జంగయ్య, సలహా దారులు కమగల్ల నర్సింహ్మ, మీసాల యాదగిరి, రాపోలు రామస్వామి, మీసాల కృష్ణ, ఉపాధ్యక్షులు చంటి శ్రీనివాస్, దానగళ్ల బలరాం, కార్యదర్యులు చిన్నగల్ల సంతోష, రాపోల్ పవన్, ఎర్రమసుగారి ప్రశాంత్, రామ గల్ల చంటి, సాంస్కృతిక కార్యాదర్శి చిన్నగల్ల వినయ్, కాచి పల్లి బాలు, చిన్నగల్ల పరమేష్, మైసగల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *