ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ అభ్యర్థుల రాతపరీక్ష

ప్రశాంతంగా ముగిసిన
ఎస్.ఐ అభ్యర్థుల రాతపరీక్ష

18 కేంద్రాలు: 13,310 మంది అభ్యర్థులు
కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్-ఇన్పెక్టర్ (సివిల్) ఎ.ఆర్/టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన రాత పరీక్షలు ఆదివారం నాడు ముగిసాయి. అభ్యర్ధుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో 18 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు అనంతరం మధ్యాహ్నం 2:30గంటల నుండి 5:30గంటల వరకు కొనసాగింది. 13,310 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పరీక్షల సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ట క్రమబద్ధీకరణ చర్యలు తీసుకున్నారు. పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్ సెంటర్లను మూసిఉంచారు. నగరంలోని లాడ్జిలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. క్యూపద్ధతి ద్వారా అభ్యర్థులను పరీక్షాహాల్లోకి అనుమతించారు. పురుష, మహిళ అభ్యర్థులను వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ వివరములను నమోదు చేయడం జరిగిందని కరీంనగర్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడు ప్రత్యక్ష్య పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *