దివ్యాంగులకు పెన్షన్ రూ.4,016
- పెంచుతూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ఈ నెల నుంచే పెరిగిన పెన్షన్లను ఇవ్వన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 22 (విశ్వం న్యూస్) : దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ గారు, సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
- దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా …ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి పుష్పగుచ్ఛం అందిస్తూ ధన్యవాదాలు తెలిపిన మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్