ఆర్టీఐ క్రింద సమాచారం ఇవ్వని పీఐఓ..
రాష్ట్ర సమాచార కమిషన్ లో పిర్యాదు
- కోట్ల కుంభకోణం అవినీతి బాగోతం బయటపడుతుందని భయంతో నాటకం
- వందకు పైగా సమాచారం కోసం దరఖాస్తులు.. దాట వేస్తున్న అధికారులు
- అవినీతి జలగల్ని కోర్టు మెట్లు ఎక్కించే వరకు పోరాడుతాం: బీఎస్పీ
- ప్రధానంగా పరిశుధ్య విభాగం,టౌన్ ప్లానింగ్ విభాగంలో కోట్ల గోల్ మాల్
- బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికలా అంబేద్కర్ డిమాండ్
బోడుప్పల్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : పిర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ లో గత సంవత్సర కాలం నుండి అనేక సమస్యలపైనా, కార్పొరేషన్ లో ఖర్చు చేసిన నిధుల వివరాలు, అభివృద్ధి, సమస్యలు తదితర అనేక విషయాల గురించి తెలుసుకునేందుకు ఒక పౌరుడిగా దరకాస్తు చేస్తే ఒక్క దరఖాస్తుపై వివరణ సమాధానం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఈ సందర్భంగా జిల్లా బిఎస్పి ప్రధాన కార్యదర్శి అంబేడ్కర్ మాట్లాడుతూ ఈ రోజు నుండి వారానికొక దరఖాస్తు రాష్ట్ర సమాచార కమిషన్ లో వేసి, అవసరమైతే కేంద్ర సమాచార కమిషన్ కు కూడా ఆపిల్ కు వెళ్తామని అన్నారు. ఈ ప్రక్రియ అయిపోయాక కోర్టులో కేసు వేసి కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తామని హెచ్చరించారు.
తప్పు చేయనప్పుడు పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడానికి మీకు ఉన్నా ఇబ్బంది ఏమిటని అడిగారు. అతి కొద్దీ రోజుల్లో పరిశుద్ధ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన అవినీతిని బయటపెట్టి ప్రజలకు తెలియజేస్తామని పిలుపునిచ్చారు. లక్షలు జీతాలు తీసుకుంటున్న కార్పొరేషన్ అధికారులు పాలకవర్గాలు కలిసిపోయి పీర్జాదిగూడలో అక్రమ కబ్జాలు, పలు సెటిల్మెంట్లు, కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు.