గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు

  • నడుచుకుంటూ వెళ్తున్నా మహిళపై పోలీసు వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మరి పోలీసుల ప్రతాపం
  • రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు
  • ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఘటన

హైదరాబాద్, ఆగస్టు 17 (విశ్వం న్యూస్) : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటున్న గిరిజన మహిళ వరలక్ష్మి  తన కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ రోడ్డు వైపు లోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది.

ఆగస్టు 15 మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్ వస్తుండగా ఎల్బీనగర్ సర్కిల్లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించి ఆమెను చిత్రహింసలు కి గురిచేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.

ఆపై తెల్లవారుజామున ఓ అధికారి ఆదేశాల మేరకు బాధితురాలిని ఎల్బీనగర్ పోలీసులు వదలిపెట్టారు. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్
    ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వరలక్ష్మి ఆరోపణలతో ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లు శివశంకర్, సములతలను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *