జర్నలిస్ట్ కృష్ణారావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

జర్నలిస్ట్ కృష్ణారావు మృతి పట్ల
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, ఆగస్టు 17 (విశ్వం న్యూస్) : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు.

పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సిఎం అన్నారు.

ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని సిఎం కేసీఆర్ తెలిపారు.

ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం
ప్ర‌ముఖ‌ పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త త‌న‌ను క‌లిచి వేసింద‌ని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జ‌ర్న‌లిజంలో కృష్ణారావు చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని కొనియాడారు. ఈ విషాద స‌మ‌యంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు స‌ద్గ‌తులు క‌ల‌గాల‌ని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *