- మతతత్వ రాజకీయాలు చేసి యువత జీవితాలను నాశనం చేస్తున్న బిజెపి
- రాష్ట్రంలో రైతాంగ, నిరుద్యోగ సమస్యలు పట్టించుకోని బిజెపి
- డిసిసి కార్యాలయం వద్ద బిజెపి శ్రేణుల హైడ్రామా.. తీవ్రంగా ప్రతిఘటించిన కాంగ్రెస్ నాయకులు
- పవిత్రమైన పూజా మందిరాలలో పటించవలసిన హనుమాన్ చాలీసా కాంగ్రెస్ కార్యాలయాల ముందు పఠించాలని పిలుపు ఇవ్వడమా..? బండి సంజయ్ కి మతిభ్రమించింది
– కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కరీంనగర్
కరీంనగర్ బ్యూరో, మే 5 (విశ్వం న్యూస్) : కర్నాటక ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేకపోతున్నామని భావించిన బిజెపి, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటుంది, ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యాలయాలు, నాయకుల ఇళ్ళ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణము చేయాలని బండి సంజయ్ ఇచ్చిన పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి శ్రేణులు నగరంలోని డిసిసి కార్యాలయం వద్దకు చేరుకునే ప్రయత్నం చేయడంతో డిసిసి అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని వారిని తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది.
ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, తమ స్వార్ధ రాజకీయాల కోసం దేవుని పేరుతో రాజకీయం చేసే బిజెపి, హనుమాన్ ఆలయాలు పూజా మందిరాలలో పటించవలసిన పవిత్రమైన హనుమాన్ చాలీసాను కాంగ్రెస్ కార్యాలయాల ముందు పటించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇవ్వడం ఆయన వెర్రితనం.
కర్ణాటకలో బజరంగ్ దల్ పేరుతో బిజెపి చేస్తున్న మతతత్వ రాజకీయాలను అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో బిజెపి ఓటమి పాలవుతుందని రెండు రోజుల కర్ణాటక ప్రచారంలో భాగంగా గమనించిన బండి సంజయ్ తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని మరొక్కసారి మతతత్వ రాజకీయాలు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు, ఒకపక్క వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర రైతాంగం అరగోస పడుతుంటే ఏనాడు కళ్లాల్లోకి దిగని బిజెపి, వరుస పేపర్ లీకేజీల వ్యవహారాల వల్ల విద్యార్థి నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే పట్టించుకోని బిజెపి ఈ విధమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిఖార్సైన అయిన హిందువు అని చెప్పుకునే బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు వేములవాడ దేవస్థానాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో, కేంద్రం నుండి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని, దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించాలి తప్ప ఈ విధమైన చిల్లర రాజకీయాలు మానుకోవాలని, విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల యువతను రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్న బిజెపి పార్టీని త్వరలోనే ప్రజలు బొంద పెట్టడం ఖాయమని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, రహెమత్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, పడాల రాహుల్, కొమ్మెర రవీందర్ రెడ్డి, వెన్న రాజ మల్లయ్య, మడుపు మోహన్, పూదరి శివ, దన్ను సింగ్, అశోక్, శ్రావణ్, గుర్రం వాసు, సురేందర్ రెడ్డి, రాజ్ కుమార్, కొర్వి అరుణ్ కుమార్, నిహాల్ అహ్మద్, సయ్యద్ అఖిల్, లయీక్, కాడే శంకర్, కంకణాల అనిల్, పి. లింగమూర్తి, సర్వర్, తాల్లపెల్లి సంపత్ గౌడ్, రామిడి రాజిరెడ్డి, చెర్ల పద్మ, ఊరడి లత, శారద, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, షబానా మహ్మద్, హనీఫ్, ఎర్ర శ్రీనివాస్, గడప అజయ్, రామిడి తిరుపతి, నాగుల సతీష్, పులి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.