స్వరాష్ట్రములో విద్యుత్ కోతలు సిగ్గుచేటు

> వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి:పత్తి కృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు
>ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి:కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కరీంనగర్, పిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో రైతాంగం పంటలు పండించనట్లు, విద్యుత్ కోతలు పెట్టినట్లు, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకొని ఇప్పుడు వ్యవసాయ రంగానికి త్రీఫేస్ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అయోమయానికి గురిచేసింది, కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన వరి సాగు జరుగుతుంది, వరి సాగుకు నీరు అవసరాన్ని బట్టి రైతులు వ్యవసాయ మోటార్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు పెట్టుకుంటే 24 గంటలు కరెంటు ఉండటంవల్ల మీకు ఆటోమేటిక్ స్టార్టర్లలు అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు వాటిని తొలగించడం జరిగింది, ఇప్పుడు కనీసం 24 గంటలు కాకపోయినా కనీసం నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తు కూడా అందించడం లేదు, కనీసం రెండు మూడు గంటల నిరంతర విద్యుత్ కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది, విద్యుత్ అందించే సమయంలో నిలకడమైన వ్యవస్థ లేనందున రైతులు తమ సొంత పనులు మానుకొని కరెంటు వచ్చే సమయం కోసం వేచి చూస్తూన్నారు, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, రాత్రి వేళలో విద్యుత్తు అందించడం వల్ల పొలాలలోకి వెళ్లే రైతులు పాముకాట్లకు గురవుతున్నారని, పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్ళు తెరవాలని వరి నాట్లు ప్రారంభమై కనీసం 20 రోజులు కూడా కాలేదు అయినప్పటికీ ఈ అప్రకటిత విద్యుత్ కోతలతో భూములు నెర్రలు పారి వరి పంటలు పండే పరిస్థితి లేక రైతులు పెట్టుబడి భారాన్ని మోయవలసి వస్తుంది, వ్యవసాయ బావుల్లో, బోర్లలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్తు అందలేక పంటలు పండించలేని దుస్థితిలో రైతులు ఉన్నారు.

అందుచేత ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం వ్యవసాయం కోసం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత నాణ్యమైన త్రి ఫేస్ కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పిసిసి పిలుపు మేరకు నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి సమస్యల పరిష్కారానికి ఎస్.ఈ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ప్రభుత్వం ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లయితే రైతుల పక్షాన మరోమారు తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే రాష్ట్ర రైతాంగంతో కలిసి హైదరాబాదులోని విద్యుత్ సౌదా ను ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, నాయకులు అబ్దుల్ రహమాన్, చిట్కురి అనంతరెడ్డి, కల్వల రామచందర్, బోనాల మురళీ మనోహర్, రామిడి రాజిరెడ్డి, గోపు మల్లారెడ్డి, నందగిరి రవీంద్ర చారి, కుర్ర పోచయ్య, లావణ్య, పుష్పలత, జ్యోతి, సునిత, కవిత, శకుంతల, రామిడి తిరుపతిరెడ్డి, కామ్డి రామిరెడ్డి, పూదరి శివ, మొసర్ల రామ్ రెడ్డి, సంపత్, గూడెపు సారంగపాణి, సాహెబ్ హుస్సేన్, కంది తిరుపతిరెడ్డి, రోళ్ళ సతీష్, తదితరులు పాల్గొన్నారు.