మండల సేవాలాల్ ఉత్సవకమిటీ ఎన్నిక – అధ్యక్షుడిగా నర్సింహ నాయక్
వరంగల్ బ్యూరో, పిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : లంబాడీలు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం (టేస్టా) జిల్లా అధ్యక్షుడు భూక్య సక్రు నాయ పిలుపునిచ్చారు. సోమవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెస్టా జిల్లా అధ్యక్షుడు భూక్య సకృనాయక్ మాట్లాడుతూ శ్రీ సద్గురు సేవాలాల్ మహరాజ్ 284 జయంతి ఉత్సవాలను ఘనంగా బంజారాలు జరుపుకోవాలన్నారు. ఫిబ్రవరి 15 తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. జయంతి ఉత్సవాలు ఈనెల 15న గాంధీనగర్ లో 18 తేదీన గోవిందరావుపేట మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా నర్సింహ నాయక్, ప్రధానకార్యదర్శి గా అజ్మెర సురేష్, గౌరవ అధ్యక్షులుగా లవుడియా జోగ, భూక్య రాజు, కోశాధికారి సంసాత్ రాజు సభ్యులను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమంలో జంపయ్య నాయక్, రాజు, సారయ్య,బాబూరావు, నర్సింగియా తదితరులు పాల్గొన్నారు.
