Vishwam Newsకరీంనగర్తెలంగాణ

ప్రజా గోస.. బీజేపీ భరోసా…

ప్రజా గోస.. బీజేపీ భరోసా…

జమ్మికుంట, పిబ్రవరి 20 (విశ్వం న్యూస్) : భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణలోప్రజా గోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమములో శక్తి కేంద్ర ఇంచార్జి ఇటికాల స్వరూప అధ్యక్షతన ముఖ్య అతిధిగా హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి మచ్చలేని అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, గ్రామపంచాయతీలు స్థానిక సంస్థలు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ఎల్ఈడి లైట్లు సీసీ రోడ్లు రైతు నివేదికలు వైకుంఠధామాలు లాంటి అభివృద్ధి పనులను కేంద్రం నిధుల వల్లే ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా విపత్తు సమయాల్లో పేదలు ఎవరు ఆకలితో అలమట్టించోద్దని మూడేళ్లుగా పేదలకు ఉచిత రేషన్ బియ్యాన్ని ప్రతి వ్యక్తికి ఐదు కిలోలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్.మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరాశ అవినీతి కుటుంబ పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులుస్తున్నప్పటికీ ఏమి ఇవ్వడం లేదని ప్రజల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేస్తూ స్వార్థపూరిత రాజకీయాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. తెలంగాణ రాష్ట్రములో టీఆరెఎస్ ప్రభుత్వం నిరాశ అవినీతి కుటుంబ పాలన సాగుతుందని కుటుంబ పాలనకు బుద్ది చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సట్ల సునీల్ 182 బూత్ అధ్యక్షులు, గట్టు రాకేష్ 170 బూతు అధ్యక్షులు, మునుగోడు వెంకన్న 188 అధ్యక్షులు, దాట్ల కుమారస్వామి 29వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *