ప్రీతి మృతిపై హైకోర్టు సెట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి
ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
మాదిగ హక్కుల దండోరా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రేనుకుంట్ల కుమార్ మాదిగ డిమాండ్
కరీంనగర్, పిబ్రవరి 27 (విశ్వం న్యూస్) : వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల పిజి మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతిపై రాష్ట్ర హైకోర్టు సెట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థుల పట్ల జరుగుతున్న ర్యాగింగ్ ను గుర్తించి అరికట్టడంలో విఫలమైన కేఎంసి సూపర్డెంట్ మరియు ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ అరికట్టే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .