హైదరాబాద్, ఆగస్టు 11 (విశ్వం న్యూస్) : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్య మంత్రి, ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ రూ.100 నాణేన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన గౌరవార్థం కేంద్రం రూ.100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ రూ.100 నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు.
ఈ వంద రూపాయల ఈ కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ, భాషలలో 1923-2023 అని ముద్రించినట్లుగా ఆర్బీఐ తెలిపింది. నాణెం విజుదలకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.