వాణిజ్య పన్నుల శాఖలో నలుగురికి ఏసీటీవో గా ప్రమోషన్లు

వాణిజ్య పన్నుల శాఖలో
నలుగురికి ఏసీటీవో గా ప్రమోషన్లు

  • హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

హైదరాబాద్, జూన్ 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసిటిఓ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోలకు అందుబాటులో ఉంటూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ఎప్పటికీ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీదేవి మరియు రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ మహమ్మద్ Rizvi, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు, అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ల దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకుని వెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు ముందు వరుసలో ఉంటూ ఎప్పటికీ అప్పుడు ఆ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఎంతో కృషి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర అంతట టిసిటిఎన్జీవో సంఘాన్ని బలోపేతం చేస్తూ సంఘం దృష్టికి వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు ఎప్పటికీ అప్పుడు పరిష్కరిస్తూ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసిటిఓ లకు గెజిటెడ్ హోదా రావడానికి ఎంతో టి సి టి ఎన్జీవో సంఘం పనిచేస్తుంది.

2017 సంవత్సరము నుండి ఇప్పుడు 2024 సంవత్సరం వరకు సుదీర్ఘమైన పట్టుదలతో టిసిటిఎన్జీవో సంఘం ఎంతో కృషి చేస్తుంది. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోలకు గజిటెడ్ హోదా ఇప్పించే వరకు టి సి టి ఎన్జీవో సంఘం నిద్రపోయేది లేదని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏ సి టి ఓ ప్రమోషన్లతోపాటు బదిలీలు కూడా చేయించడానికి టి సి టి ఎన్జీవో సంఘం ఎంతో కృషి చేస్తుంది.

వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు టిసిటిఎన్జీవో సంఘం ఉద్యోగులకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని మా సంఘానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారులందరికీ ఈ సందర్భంగా టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ నలుగురికి ఏసిటిఓ ప్రమోషన్లు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ శ్రీమతి శ్రీదేవి తో పాటు, సెక్రటరీ శ్రీమతి సునీత, ఉప కమిషనర్ రవి, వరంగల్ జాయింట్ కమిషనర్ వి.శ్రీనివాస్ రెడ్డి తోపాటు, అధికారుల అందరికీ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మహబూబాబాద్ సీటిఓ కార్యాలయంలో పనిచేయుచున్న శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ కు ఒకరోజు పదవి విరమణ ఉన్న శ్రీనివాస్ ఎ సి టి ఓ ప్రమోషన్ ఇప్పించినందుకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కు సన్మానం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వరంగల్ డివిజన్ టిసిటిఎన్జీవోస్ సంఘము అధ్యక్షులు గోపి కిషోర్, జాయింట్ సెక్రెటరీ రమేష్ ఉన్నారు.

శ్రీనివాస్ తో పాటు మరి ముగ్గురికి ఏసీటీవో ప్రమోషన్లు ఇప్పించటం జరిగింది మొత్తం నలుగురికి సీనియర్ అసిస్టెంట్ నుండి ఏసీటీవో ప్రమోషన్లు స్వీట్ తో పాటు శాలువాలతో సన్మానించారు.

ఎప్పటికీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులకు అందుబాటులో ఉంటానని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *