రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా నిరసన దీక్ష

రాహుల్ గాంధీ గారికి
సంఘీభావంగా నిరసన దీక్ష

పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్
కరీంనగర్, మార్చి 27 (విశ్వం న్యూస్) : దొంగలు అందరూ మోడీ అని పేరు పెట్టుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల పట్ల నరేంద్ర మోడీ నేతృత్యంలోని బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుండి బహిష్కరించడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నుకున్న నాయకులపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలను వెత్రికిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ద్వారా రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా *కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ… నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటి దేశాన్ని ఆర్థికంగా ముంచిన దొంగలందరూ మోడీ పేరు పెట్టుకున్నారు అని రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల్లో మోదీ అంటే తన ఇంటి పేరు అని, దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీని దొంగ అన్నారని పరువు నష్టం కేసు వేయించి రాజకీయ కుట్రతో రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుండి బహిష్కరిస్తే, దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ మోడీ ని దొంగ అంటారని, ఎంతమందిని జైలుకు పంపిస్తారో చూస్తామని సవాలు విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *