మణిపూర్లో క్రైస్తవులపైన మారణకాండ ఆపాలని నిరసనలు

మణిపూర్ లో క్రైస్తవులపైన జరుగుతున్న
మారణకాండ ఆపాలని నిరసనలు

బిషప్ సింఘం ఆధ్వర్యంలో
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు
బోడుప్పల్, మే 26 (విశ్వం న్యూస్) : మణిపూర్ లో క్రైస్తవులపైన జరుగుతున్న మారణకాండ కాల్చివేతలకు నిరసనగా బిషప్ సంఘం టీం సభ్యులు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సంసోను సేన కలిసి మదర్ థెరిస్సా విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించి మణిపూర్ లో మరణించిన క్రైస్తవులకు నివాళులర్పించారు.

చనిపోయిన వారికి పది లక్షలు గాయపడిన వారికి ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని బిషప్ సింఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిషప్ సింగంతో పాటు బెజవాడ రవికుమార్, డాక్టర్ సుధాకర్, ఇల్లూరి ప్రసాద్, క్రిస్ శ్రీకాంత్, ఆల్ఫ్రెడ్ మాలోజి, స్వీటీ సంతోష్ , ఫ్రాన్సిస్ సాల్మన్, డేవిడ్ ఫ్రాంక్లిన్, మైకేల్, అనిల్ కుమార్ శేఖర్, సునీల్ ,సుబోదు, జేసన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *