పగలైనా-రాత్రైనా ప్రజాసేవే లక్ష్యంగా
డా. రసమయి భరోసా-పర్యటన
తిమ్మాపూర్, జనవరి 14 (విశ్వం న్యూస్) : పగలైనా-రాత్రైనా ప్రజాసేవే లక్ష్యంగా..చీకటిలో సైతం పర్యటిస్తూ ప్రజా సమస్యలల్లో భాగంగా కార్య కర్త కుటుంబానికి కొండంత భరోసా కల్పించిన ఎమ్మె ల్యే డా.రసమయి బాలకిషన్ ఔదార్యం. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గంగిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విస్తృతంగా పర్య టిస్తూ, ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యల ను పరిష్కరిస్తూ తన పర్యటనను ఎంతో ఉత్సాహం గా కొసాగించారు. దీనిలో భాగంగా నూనె కుమార స్వామి అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గత 5 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేసి, ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటాం అని, అధైర్య పడద్దు అంటూ కొండంత భరోసా కల్పించారు. అనంతరం ప్రతి లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్ళి కళ్యాణాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదా రులు, ప్రజలు మాట్లాడుతూ.. చీకటిని సైతం లెక్క చేయకుండా తమ ఇళ్లకు నేరుగా వచ్చి భరోసా కల్పించి, చెక్కులు అందించిన మంచి మనసున్న మారాజు, పేదల పెన్నిధి మా రసమయి అన్న అని కొనియాడుతూ, వచ్చే ఎన్నికల్లో సైతం ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హామీ ఇస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీవి.రామకృష్ణారావు, జడ్పిటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు, లబ్ధిదారులు, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.