బీజేపీని ఓడించాలి.. దానికి ఖమ్మం సభ నాంది కావాలి అన్న రాజా
ఖమ్మం, జనవరి 18 (విశ్వం న్యూస్) : ఖమ్మం వేదికగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రసంగం:
• తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళుర్పిస్తున్నా
• తెలంగాణలో సుపరిపాలన అందుతోందని, సీఎం కేసీఆర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా
• విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది,
• దేశంలో నిరంతర కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
• తెలంగాణలో రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయం
• రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలు తేవాలి
• భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.
• దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడింది.. భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోంది.
• కేంద్రం విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను కేంద్రం విస్మరిస్తోంది.
• మోదీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారు.
• ప్రధాని మోదీ పేద ప్రజలు, రైతుల పక్షాన లేరు.. అదానీ, అంబానీ, టాటా.బిర్లా జపం చేస్తున్నారు.
• బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నది, కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దుమీరుతున్నారు.
• తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు.
• బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలి.
• ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు.
• బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం
• బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలి.