ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
వీణవంక, మే 21 (విశ్వం న్యూస్) : భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అతి చిన్న వయసులోనే ప్రధాని పదవి చేపట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి టెక్నాలజీ వ్యవస్థను ముందుచూపుతో భారత దేశంలో ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారిది దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తిని, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన తీర్పు రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య, చదువు జైపాల్ రెడ్డి, గిరవేనా సాయిలు, మండల రాజయ్య, మందల అనిల్ రెడ్డి, ఎండి రజాక్, తదితరులు పాల్గొన్నారు.