తెలంగాణ : శుక్రవారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం

తెలంగాణ : శుక్రవారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం

హైదరాబాద్, మార్చి 22 (విశ్వం న్యూస్) : ప్రపంచంలోనే ముస్లింలకు రంజాన్ నెల ఉపవాసాలు శుక్రవారం నుండి ప్రారంభమవుతున్నాయి గురువారం రోజు రాత్రి అన్ని మసీదులలో ఖురాన్ చదవడం జరుగుతుంది. ఆ సందర్భముగా ఈరోజు జూబ్లీహిల్స్ లో మినిస్టర్స్ కోటర్స్ లో తెలంగాణ రాష్ట్ర ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ మంత్రివర్యులు జనాబ్ మహమ్మద్ మహిముద్ అలీకు అడ్వాన్సుగా రంజాన్ ఉపవాసాలు సందర్భంగా ఖర్జురా పండ్లు గిఫ్ట్ అందజేస్తూ మహముద్ అలీని శాలువాతో సన్మానం చేస్తూ పుష్పగుచ్చం అందజేసి రంజాన్ ఉపవాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవాంఛనీయా సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని రకాలుగా ప్రశాంత వాతావరణంలో రాష్ట్రం అంతట జరుపుకుంటున్నారు. ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పి అన్నాతమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దావత్ ఇఫ్తార్ ఇచ్చినట్టే, నిరుపేద ముస్లింలకు బట్టలు పంపిణీ కార్యక్రమం యధావిధిగా జరపాలని మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మరియు మో జాన్ లకు కూడా నెలవారి జీతాలు అందేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా అన్ని మసీదుల చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరణ చేయాలి. ప్రతి మసీదులలో ప్రతిరోజు బీజింగ్ పౌడర్ చల్లాలి. ప్రతిరోజు ఉదయం మున్సిపల్ కార్మికులు పరిశుభ్రత చేయాలి. ఎక్కడైనా నీటి ఇబ్బంది ఏర్పడితే టాక్టర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. రాత్రిపూట విద్యుత్తు ఇబ్బంది లేనట్టు చూడవలసిన బాధ్యత కూడా విద్యుత్ శాఖ అధికారులపై ఉంది. ప్రతి సంవత్సరం అన్ని రకాలుగా మున్సిపల్ అధికారులు మరియు పోలీసు అధికారులు సహాయ సహకారాలు అందించాలని మహమ్మద్ ముజాహిద్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *