పట్టణ వాసులతో రక్షాబంధన్
జరుపుకున్నఆవాసవిద్యార్థులు
శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం
జమ్మికుంట, ఆగస్టు 29 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం విద్యార్థిని విద్యార్థులు పట్టణంలోని కూరగాయల మార్కెట్ నందు మెయిన్ రోడ్లలో ఉన్న వ్యాపారులతో రక్షాబంధన్ విశిష్టతను ఆవశ్యకతను వివరిస్తూ భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ ఒకరికి ఒకరు రక్ష అనే నినాదంతో ఆనందోత్సాహాలతో ముందస్తు రాఖీ పౌర్ణమిని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ రాఖీ కేవలం తమ సొంత వారితో కాకుండా ఈ విధంగా పట్టణంలోని అందరితో నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ప్రధాన చార్యులు సుధాకర్ రావు, ఆచార్జీలు, మాతాజీలు, తదితరులు పాల్గొన్నారు.