ప్రధానికి రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు
హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్) : వీడ్కోలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు చేశారు. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం, హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర సహకారం, ఇంటింటికీ నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, భారత్ మాలలో తెలంగాణకు ప్రాధాన్యత, తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ తదితర అంశాల్లో సహకారం కోరుతూ విజ్ఞాపన లేఖను అందించారు.