రేవంత్:యుద్ధం మొదలయ్యింది

దుర్యోదనుడు తన వెనుక ఎంత మంది ఉన్నారని చూశాడు.
అర్జునుడు తన వెనుక ఎవరున్నారని చూశాడు.
బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు.
దర్మాన్ని నమ్ముకున్నోడు గెలిచాడు.!!!

హైదరాబాద్, మార్చి 19 (విశ్వం న్యూస్) : దుష్ట శక్తులంతా ఏకమై అధ ర్మాన్ని (రేవంత్ ను)గెలిపించొచ్చు.
అది తాత్కాలికమే.
ఎప్పటికైనా ధర్మమే (బాపు కేసిఆర్)గెలుస్తుంది.
తెలంగాణను వ్యతిరేకించిన శత్రువులంతా రేవంత్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
దీన్నిబట్టి రేవంత్ ఎవరి ప్రయోజనంకోసం పనిచేస్తాడో ఆలోచించండి.!!!

బాపు కేసిఆర్ గారి దయవల్ల నాయకులైనవారు,పెద్దపెద్ద పదవులు అనుభవించినవారందరు వారివారి స్వార్థ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ లో చేరుతున్నారు.
వాళ్ళ వ్యాపారాలు,వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి విలువలు వదిలేసి రేవంత్ పాదాలకు సాగిలపడుతున్నారు.
ఇందుకు ఆంధ్రమీడియా,వాళ్ళ బానిస ప్రభుత్వ పెద్దలు సంకలు గుద్దుకొని ఉంటుండొచ్చు.
సత్యం అసత్యంకాదు.
నిజం అబద్దంకాదు.
సత్యం గ్రహించేవాళ్ళు కూడా ఉంటారు. !!!

వాళ్ళు తెలంగాణ ప్రయోజనమే కోరుకుంటారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగౌరవంగా తలెత్తుకొని ప్రదర్శిస్తారు.
అట్లాంటివారే పాలమూరు పగడం మన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్.
నుదిటిపై సింహం గుర్తు ఉన్నప్పుడు నిటారుగా ఎలా నిలబడ్డారో నేడు దర్మంవైపు (బాపు కేసిఆర్)వైపు నిటారుగా నిలబడ్డాడు.
అధికారమధాన్ని,దోపిడిని,దౌర్జన్యాన్ని గేలిచేస్తూ బాపు కేసిఆర్ గారికి అండగా నిలబడ్డాడు.
అన్యాయంపట్ల ప్రపంచం మౌనవహిస్తున్నప్పుడు చిన్న గొంతుతో చేసే నిరసన కూడా విస్పోటనంలా పేలుతుంది.
ఈరోజు ఆర్ఎస్ పి సార్ మాకు అంతులేని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. !!!!!

కొండలను డీకొట్టగలిగే మనోధైర్యాన్ని ఇచ్చాడు.
ఆర్ ఎస్ పి సార్ స్పూర్తి యువతలో వెల్లువిరుస్తుంది.
బాపు కేసిఆర్,ఆర్ ఎస్ పి సార్ల నాయకత్వంలో కదంతొక్కుతాం.
ఉద్యమస్పూర్తితో కాంగ్రెస్ అరాచకాన్ని నిలువరిస్తాం.

జయహో బాపు కేసిఆర్!
జయహో ఆర్ ఎస్సీ సార్!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *