మోడీతో రేవంత్ చీకటి
ఒప్పందం:దాసోజు శ్రావణ్
హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్) : సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మాని రెండు లక్షల ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి. మోడీతో రేవంత్ చీకటి ఒప్పందం. గుజరాత్ మోడల్ అంటే తెలంగాణ ను గోధ్రా గా మార్చడమా? బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా దాసోజు శ్రావణ్.
- మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్దాలాడుతున్న మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాథాలజికల్ లయర్ మారిపోయిండు.
- గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలో వున్న ఉద్యోగాలని కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా? అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగాలకు అందజేస్తామని చెప్పారా? ఈ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
- ఏ దొడ్లో కడితే ఏమిటి నా దొడ్లో ఈనితే చాలదా? అన్నట్లుగా వుంది రేవంత్ వ్యవహార శైలి. గత ప్రభుత్వం ఇచ్చిన స్టాప్ నర్స్, సింగరేణి, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి తెలివి, సమర్ధత వుంటే కొత్త ఉద్యోగాలని సృష్టించాలి.
*కెసిఆర్ హయం లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. దాదాపు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు టీఎస్ ఐ పాస్, పారిశ్రామికరణ ద్వారా కల్పించింది. రేవంత్ రెడ్డి మాయ మాటలు కట్టిపెట్టి తను ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలి. *గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేపలు ఇచ్చింది మేము ఉద్యోగాలు ఇచ్చామని కుల వృత్తులను అవమాన పరిచేలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ మాటలు ఆధిపత్య అప్పర్ క్లాస్ ఫ్యూడలిజానికి నిదర్శనం
*మోడీ ని బడే బాయ్ అంటున్నా రు రేవంత్ రెడ్డి. రేవంత్, మోడీ ల మధ్య ఒప్పందం ఏమిటీ? రాహుల్ గాంధి ఓ వైపు మోడీ ని గద్దె దించేయాలని చూస్తుంటే రేవంత్ ఆయనే ప్రధాని గా ఉండాలని కోరుకుంటున్నారు. దిన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలంగాణ సమాజం గమనించాలి. *గుజరాత్ మోడల్ అనేది ఓ అట్టర్ ఫ్లాప్ మోడల్. అక్కడ చాలా సమానతలు, కనీస మౌలిక వసతలు అందిన ప్రజలు వున్నారు. రేవంత్ దృష్టిలో గుజరాత్ మోడల్ అంటే తెలంగాణ ను గోధ్రా గా మార్చడమా?
”మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్దాలాడుతున్న మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాథాలజికల్ లయర్ మారిపోయిండు. గత ప్రభుత్వంపైన ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారిపైన అసత్య ప్రచారాలు చేసి, ఎన్నికల్లో ప్రజలని మభ్యపెట్టి, అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇపుడు అవే అబద్దాలు చెబుతూ, అబద్దాల పునాదులపైన పాలన చేస్తూ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలో వున్న ఉద్యోగాలని కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా? అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగాలకు అందజేస్తామని చెప్పారా? ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, హైదరాబాద్ ఇంచార్జ్ డా దాసోజు శ్రావణ్. ఈ మేరకు విలేకరుల సమావేశంలో డా దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. ఏ దొడ్లో కడితే ఏమిటి నా దొడ్లో ఈనితే చాలదా? అన్నట్లుగా వుంది రేవంత్ వ్యవహార శైలి. కాళేశ్వరంలో ఓ రెండు పిల్లర్లుని రిపేర్ చేయకుండా పడావ్ లో పెట్టి, పిల్లర్ల కుంగుబాటుకు కేసీఅరే బాధ్యుడని బట్టకాల్చి మీద వేస్తున్న రేవంత్ రెడ్డి.. ఈవాళ 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి ఈ ఉద్యోగాలకు సృష్టికర్త ఎవరు? ఈ ఉద్యోగాల కల్పన కేసీఆర్ సృష్టి కాదా ? అని ప్రశ్నించారు దాసోజు.
కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయంలో ఇచ్చిన ఉద్యోగాల ప్రక్రియని కూడా అందులో కలిపేసి రాజకీయ మీటింగ్ లో ప్రచారం చేసుకుంటూ లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారు. స్టాప్ నర్స్ ఉద్యోగాలన్నీ కేసీఆర్ గారి హాయంలో ఇచ్చినవే. అవి కూడా తన ఖాతాలో కలుపుకొని ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలో కత్తెరపెట్టె ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన సింగరేణి ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి తెలివి, సమర్ధత వుంటే కొత్త ఉద్యోగాలని సృష్టించాలి. అంతే కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని తన ఖాతాలో వేసుకోని 30 వేల ఉద్యోగాలు ఇచ్చేసాని చెప్పడం రేవంత్ రెడ్డి నయవంచన. ఓట్లకి వచ్చినపుడు ఒక మాట చెప్పి ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత మరో మాట చెప్పడం మోసం కాదా ? రేవంత్ కు చిత్తశుద్ధి వుంటే చిల్లర రాజకీయాలు మాని, రెండు లక్షల ఉద్యోగాలని ఎక్కడ గుర్తించారో, ఎలా సృస్టిస్తారో, ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేస్తారు.
”కెసిఆర్ హయం లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. దాదాపు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు టీఎస్ ఐ పాస్, పారిశ్రామికరణ ద్వారా కల్పించింది. రేవంత్ రెడ్డి మాయ మాటలు కట్టిపెట్టి తను ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలి. అంతేకానీ బట్టకాల్చి మీద వేసే చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి మానుకోవాలి’ అని సూచించారు. రేవంత్ రెడ్డి పదేపడే లేకితనం ప్రదర్శిస్తున్నారు. 2022 ఏప్రిల్ లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది. రెడ్డి వచ్చాడు ఆట మొదలెట్టాడనే మాదిరిగా రేవంత్ వచ్చి నోటిఫికేషన్ రద్దు చేసి దానికి ఓ అరవై ఉద్యోగాలు జత చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నాను. ఇంతకంటే మోసం మరొకటి ఉంటుందా ? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దానిపై శ్వేత పత్రం విడుదల చేయమని తెలంగాణ యువత నిలదీయాలి.”అని కోరారు.
”గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేపలు ఇచ్చింది మేము ఉద్యోగాలు ఇచ్చామని కుల వృత్తులను అవమాన పరిచేలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ మాటలు ఆధిపత్య అప్పర్ క్లాస్ ఫ్యూడలిజానికి నిదర్శనం. కాంగ్రెస్ మేనిఫెస్టో లోనే గొర్రెల పంపిణీ చేస్తామని హామీ వుంది. కానీ కనీస ఇంకితం లేకుండా కులవృత్తుల వారిని చులకన చేస్తూ తన ఫ్యూడల్ నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. చేపలు, గొర్రెల పంపిణీ తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలే మారాయి. ముఖ్యమంత్రి స్థానంలో వున్న రేవంత్ రెడ్డి కనీస సోయి లేకుండా మాట్లాడుతూ ఆ పదవికే కలంకం తెచ్చేలా ప్రవర్తించడం దురదృష్టకరం” అని పేర్కొన్నారు దాసోజు.
మోడీ ని బడే బాయ్ అంటున్నా రు రేవంత్ రెడ్డి. రేవంత్, మోడీ ల మధ్య ఒప్పందం ఏమిటీ? రాహుల్ గాంధి ఓ వైపు మోడీ ని గద్దె దించేయాలని చూస్తుంటే రేవంత్ ఆయనే ప్రధాని గా ఉండాలని కోరుకుంటున్నారు. దిన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలంగాణ సమాజం గమనించాలి. రాహుల్ గాంధీ మోడి గద్దె దిగుతారని చెబుతుంటే.. రేవంత్ మాత్రం మోడీ గద్దె దిగరని చెప్పకనే చెబుతున్నారు. మోడీతో రేవంత్ పెట్టుకున్న పొత్తుకు నిదర్శనం ఇది” అని అన్నారు. ”గుజరాత్ మోడల్ అబద్దాల మోడల్ అని కాంగ్రెస్ అధిష్టానం అంటే ..రేవంత్ దాన్ని గొప్ప మోడల్ అంటున్నారు. గుజరాత్ మోడల్ అనేది ఓ అట్టర్ ఫ్లాప్ మోడల్. అక్కడ చాలా సమానతలు, కనీస మౌలిక వసతలు అందిన ప్రజలు వున్నారు. రేవంత్ దృష్టిలో గుజరాత్ మోడల్ అంటే తెలంగాణ ను గోధ్రా గా మార్చడమా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
దయచేసి రేవంత్ రెడ్డి లేకితనం మానుకోవాలి. అబద్దాలు మాట్లాడటం మాని మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రైవేట్ సెక్టార్ లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలి. అంతేకానీ అబద్దాలతో మోసం చేసే ప్రయత్నం చేయొద్దు” అని విజ్ఞప్తి చేశారు డా దాసోజు.