సమంత, రాజ్ నిడిమోరుతో ఏడడుగులు! ఫోటోలు వైరల్


ప్రముఖ నటి సమంత తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రెండో వివాహం కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్లో సాంప్రదాయ పద్ధతుల్లో నిశ్శబ్దంగా జరిగింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ సాన్నిధ్యంలో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి హంగామా లేకుండా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ పెళ్లి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్
వివాహానంతరం సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎరుపు రంగు సంప్రదాయ చీరలో, మెదటి పొదిగిన ఆభరణాలతో సమంత కాంతివంతంగా కనిపించారు. ఆమె పక్కనే తెలుపు కుర్తా, లేత గోధుమ నెహ్రూ జాకెట్‌లో సింపుల్ & ఎలిగెంట్ లుక్‌తో రాజ్ నిడిమోరు మెరిసాడు. ఈ జంటను చూసి అభిమానులు, సహచరులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

రెండో పెళ్లిగా గమనార్హం
సమంత–రాజ్ ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం అన్న విషయం తెలిసిందే. 2017లో జరిగిన నాగ చైతన్య–సమంత రొమాన్స్ కథ 2021లో విడాకులతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా తన మాజీ భార్య శ్యామలి డేతో విడిపోయారు.
కొత్త జీవితానికి తొలి అడుగు: గతాన్ని వెనక్కి పెట్టి, కొత్త ఆరంభానికి ఇద్దరూ సిద్ధమయ్యారు. అభిమానులు, మిత్రులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంట భవిష్యత్తు ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.

మొత్తానికి, సమంత–రాజ్ నిడిమోరు వివాహం సినీ ప్రపంచంలోనే కాక సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారింది.