
హైదరాబాద్, నవంబర్ 30 (విశ్వం న్యూస్) : కేసీఆర్ పోరాటం… కేసీఆర్ దీక్ష… ఇవి ఎప్పటికీ చెరిగిపోని చరిత్ర. నిన్నటి రోజు కొన్ని వెకిలి, అజ్ఞానం మిక్స్డ్ పచ్చ కుక్కలు కేసీఆర్ గారి దీక్షపై చిల్లర మల్లర కూతలు కూశాయి. “కేసీఆర్ ఏం చేశాడు దీక్ష?” అని అడగడం వాళ్ల అర్ధంలేని అహంకారానికి నిదర్శనం.
అరేయ్ బ్లడీఫూల్స్… వలసవాద ఆధిపత్యానికి అగ్గిపెట్టి, ఆ అహంకారాన్ని బుగ్గి చేసింది కేసీఆర్ చేసిన దీక్షే. నాయకులు ఉన్నా, నాయకత్వం మనది కాని ఈ నేలపై, నాయకత్వాన్ని సృష్టించి నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్.
మీ బాస్‌లు వలసవాద నాయకుల బూట్లు నాకుతూ తెలంగాణను మోసం చేస్తే — సింహంలా గర్జించి ఎదిరించినవాడు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు తరలించుకుపోతుంటే మీ నాయకత్వం మొద్దు నిద్రలో ఉండగా, అడ్డుగోడగా నిలబడ్డాడు కేసీఆర్.
తెలంగాణ తల్లి ఆత్మగౌరవం తొక్కబెట్టబడుతున్నా, పదవుల కోసం పచ్చ బానిసలు మూసుకుపోతుంటే — తల్లి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తినవాడు కేసీఆర్. అంతా అయిపోయిందనుకున్న చోట అగ్గిరాజేసి ఉద్యమ కాగడాను వెలిగించినవాడు ఆయనే. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన సమైక్యాంధ్ర నేతల లాబీయింగ్‌కి ఎదురు నిలిచి, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన నాయకుడు కేసీఆర్.
తాను సచ్చినా… తెలంగాణ వచ్చిందంటే చాలు అన్న త్యాగదీక్షతో, తెలంగాణను డిల్లీ వద్దే తిరిగి పట్టుకొచ్చిన వాడే కేసీఆర్. సబ్బండ తెలంగాణ జాతిని ఏకం చేసి ఉద్యమాన్ని నడిపినా, స్వరాష్ట్రంలో సంక్షేమ–అభివృద్ధి చేసినా—అది కేసీఆర్ చేతే సాధ్యమైంది.
పద్నాలుగు ఏళ్లు ఉద్యమాన్ని బ్యాలెన్స్ చేయడం… అది 30 నిమిషాల బూతుల ఉపన్యాసం దంచడమే కాదండోయ్ అబ్బాయిలు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో వచ్చిన అధికారంతో మీ అహంకారం ఆకాశాన్ని తాకుతోంది గానీ, స్వరాష్ట్ర పోరాటంలో కేసీఆర్ పాత్రను తుడిచేయాలని ప్రయత్నిస్తే… చరిత్ర మిమ్మల్ని తుడిచేస్తుంది.
తెలంగాణ ఆనవాలు అంటే కేసీఆర్. ఆయన చేసిన చరిత్ర… ఈ సృష్టి అంతం అయితే తప్ప చెరిపేయలేరు.
ఆయన జెండా ఎత్తిన నాడు మీరు అమూల్ బేబీలు.
అడ్డగోలు కూతలద్దులో…
తస్మాత్ జాగ్రత్త — అధికారమన్నది ఎవరికీ శాశ్వతం కాదు.