రాష్ట్రంలో ఇసుక మాఫియా : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఇసుక మాఫియా : రేవంత్ రెడ్డి

తనుగుల గ్రామంలో ఇసుక క్వారీని సందర్శించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
జమ్మికుంట, మార్చి 1 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనుగుల ఇసుక క్వారీని తనిఖీలో భాగంగా ఈరోజు తనుగుల గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు మరియు రెవిన్యూ అధికారులు మరియు మైనింగ్ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మకై ఎవరి ఇష్టారాజ్యం వారు వ్యవహారిస్తున్నారు. రోడ్డు రవాణా నాశనం చేస్తున్నారు మరియు ఇసుక స్టోరేజ్ పెడుతున్నారు. లారీల లారీలు రవాణా చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరి వెంకట్, మరియు పత్తి కృష్ణారెడ్డి, వీణవంక కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ హుసేని, హుజూరాబాద్ మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అప్సర్ భాయ్, తదితరు నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *