సంక్రాంతి : ముగ్గుల పోటీలు… సంప్రదాయాలకు ప్రతిబింబాలు

సంక్రాంతి : ముగ్గుల పోటీలు… సంప్రదాయాలకు ప్రతిబింబాలు

డా. గూడూరి చెన్నారెడ్డి – ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ ప్రెసిడెంట్
హైదరాబాద్, జనవరి 14 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ లో శనివారం నాడు గూడూరి ఫౌండేషన్, స్నేహితం ట్రస్ట్, రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్స్ గారి సంయుక్త కలయికలో… తెలుగు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన పండుగ దాని ప్రత్యేకతలను నేటి తరానికి తెలిపేందుకు మరి ముఖ్యంగా సిటీలో చదువుతున్న పిల్లలకు మన సాంస్కృతిక సంప్రదాయాలు తెలిపేటందుకు యోగ, ప్రాణాయామం, మెడిటేషన్, కుంగ్ ఫ్పూ, జిమ్నాస్టిక్ మొదలగు వాటిల్లో మా అధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

డా. గూడూరి చెన్నారెడ్డి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ ప్రెసిడెంట్, గూడూరి ఫౌండేషన్ కోశాధికారిణి డా.బికె. గూడూరి విజయలక్ష్మి గారు, స్నేహితం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చింతపల్లి శోభారెడ్డి గారు, జి. మహేందర్ రెడ్డి గారు (ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్), శ్రీ జి. శ్రీధర్ రెడ్డి గారు, సామాజిక సేవ ఆర్గనైజర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. డా. చెన్నారెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో స్వచ్ఛత అనేది చాలావరకు లోపించిందని, అందుకే విద్యార్థులు మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని, మీరు పాతిక సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే మిగిలిన జీవితకాలం సుఖంగా ఉండే అవకాశం మీకు దొరుకుతుందని, ఆరోగ్యం ఉంటేనే అన్ని సాధించుకునే అవకాశం ఉంటుందని, మీరు మీ కళాశాలలో ఏవైతే నేర్చుకుంటున్నారో అది క్రమం తప్పకుండా అభ్యాసంలో పెట్టుకోవాలి వాటి ద్వారానే మీకు శరీర దారుడ్యంతో పాటు మనోబలం పెరుగుతుందని తద్వారా మీరు భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహిం చవచ్చునని, తద్వారా మీ మీద ఆధారపడిన వారికి, మీ తల్లిదండ్రులకి భారం కావద్దని, అలాగే పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి వారిని ప్రశంసిస్తూ.. మీరు మీ పిల్లలను ఇప్పటినుంచే క్రమశిక్షణ గల కార్యక్రమాలలో వారిని చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కొనియాడారు.

డా. గూడూరి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ సంక్రాంతి అనేది పట్టణ వాసులకు తెలియకుండా పోతుందని దానిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించడం. సంతోషకరం. చింతపల్లి శోభా రెడ్డి గారు మాట్లాడుతూ మేమే కార్యక్రమాలు అయితే ఇక్కడ మీకు ఇస్తున్నాము ఇవేగాక మునుముందు డాన్స్ క్లాసులు, మ్యూజికల్, సింగింగ్ లాంటి కార్యక్రమాలు మీ ముందుకు తెస్తామని అన్నారు. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టం సంక్రాంతి పండుగ ఒక పండుగనే గాక తద్వారా ఆరోగ్య చిట్కాలు, గణిత శాస్త్రం కూడా నేర్పడం ఈ ముగ్గుల పోటీ ద్వారానే సాధ్యపడుతుందని తన అభిప్రాయం తెలియజేశారు.
పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ బిజీ షెడ్యూల్లో పిల్లలకు ఏమి నేర్పాలో అనేది జాగ్రత్తలు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొత్తవి నేర్చుకోగలిగామని తెలియపరిచినారు. ఈవెంట్ ఆర్గనైజర్గా కళ్యాణ్ రెడ్డి వ్యవహరించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు బహుకరించారు. బహుమతి పొందిన సీనియర్స్ : సహస్ర, కీర్తన. జూనియర్స్ : సుదీక్ష, నిషిక, సబ్ జూనియర్స్: అనయ, సుహాన్య

స్పెషల్ ఇన్వైట్గా ఆహ్వానించిన మాస్టర్ వన్ రాజ్ రెడ్డి ఆయన డాన్స్ ద్వారా నాలుగు గంటలు శ్రమించి ముగ్గుల పోటీలో పాల్గొన్న పోటీదారులను వారి కుటుంబ సభ్యులను తన డ్యాన్స్ ద్వారా ఉత్సాహన్ని నింపినారు. వారికి తోడుగా బేబీ తరుణీ రెడ్డి మరియు అక్షత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *