ఏసిడి బిల్లుల వసూళ్ల పై నిరసనల సెగ

ఏసిడి బిల్లుల వసూళ్ల పై నిరసనల సెగ

బిజెపి, సిపిఎం ఆధ్వర్యంలో
తిమ్మాపూర్, జనవరి 21 (విశ్వం న్యూస్) : గృహ వినియోగదారులనుండి అక్రమంగా వసూలు చేస్తున్న ఏసీడి బిల్లులను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బిజెపి అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు. ముందస్తు విని యోగం దరావత్తు పేరిట వసూళ్లను రద్దు చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నుస్తులాపూర్ సబ్ స్టేషన్ వద్ద శనివారం మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ… ఇష్టమొచ్చిన రీతిలో చార్జీలను పెం చుతూ ప్రజలను ప్రభుత్వం ఇబ్బందిపెడుతుందని, ఏసిడి పేరుతో రెట్టింపు చార్జీలను వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. అవగాహన లేని వారితో విద్యుత్ బిల్లులను నమోదు చేస్తున్నారని దీంతో కూడా వినియోగదారులపై అనవ సరమైన భారం పడుతుందని అన్నారు. వెంటనే అక్ర మ వసూళ్ల పై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేసారు. అనంతరం ఏసిడి బిల్లుల వసూళ్ల ను రద్దు చేయాలని కోరుతూ నుస్తులాపూర్ ఏఈ కి వినతి పత్రం అందజేసినారు. వెంటనే దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మావురపు సంపత్, ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోనాల మోహన్, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపెళ్లి రాజు గౌడ్, దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి స్వామి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కందుకూరి ఈశ్వరాచారి, అన్నాడి రమణారెడ్డి, బూర్గు శ్రీనివాస్ రెడ్డి, చెన్నబో యిన శ్రీనివాస్, మూడపల్లి సమ్మయ్య, పల్లె శ్రీనివాస్ రెడ్డి, పర్లపల్లి మల్లయ్య, పిట్టల మహేష్, గట్టు రాజు, కీసర సంపత్, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ దోపిడిని నిలిపివేయాలి: సీపీఎం డిమాండ్
విద్యుత్ వినియోగదారులపై ఏసిడి పెరుతో భారాలు మోపే ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ, తక్షణమే ఉప సంహరించుకోవాలని సీపీఎం పార్టీ జోన్ కార్యదర్శి సుంకరి సంపత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగిన కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ…2018 నుండి 2022 వరకు రెగ్యు లేటరీ కమిషన్ టారీఫ్ నిర్ణయించలేదు. డిస్కాం లు ఎలాంటి టారీఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదు. ఈ నాలుగేళ్ల బాకీలు రు.33వేల కోట్ల వసూళ్లకు 2022-23లో టారీఫ్ ప్రతిపాదనలో ఎలాంటి సూచ నలు లేవు అని, రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండానే డిస్కాంలు గత సంవత్సరం “డెవలప్మెంట్ ఛార్జీలు” పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారం వేసి వేల కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేయడం బాధాకరమని, డిస్కాంలు అంతర్గత సామర్థ్యం పెంచుకోకుండా వినియోగదారులపై భారాలు వేస్తున్నాయి. నేటికీ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్ట ప్రకారం బొగ్గు, గ్యాస్, నీరు తదితర ముడి సరుకుల ధరలు పెరిగిన ప్పుడు వాటికి అనుగుణంగా ఛార్జీలను పెంచాలని డిస్కాంలు దరఖాస్తులు పెట్టుకుంటే రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణ జరిపి ముడిసరుకుల ధరలకనుగుణంగా ఛార్జీలను నిర్ణయించాలి. కానీ ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయని డిస్కాంలు తప్పుడు లెక్కలు చూపించి వినియోగదారుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇది సరైందికాదు. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు డిస్కాం లు “ఫ్యూయల్ సర్ ఛార్జీలు” ఎప్పటికప్పుడు వసూ లు చేసుకోవాలని గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించడం అత్యంత దుర్మా ర్గం.అని అన్నారు ఈ అదనపు ఛార్జ్ లు అయినా ఏసీడీ చార్జీల పైన సమర శీలపోరాటలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమo లో జోన్ కమ్మిట్టి సబ్యులు మాతంగి శంకర్, నాయకులు చలుకూరి బాలయ్య, కసాది పవన్ కొమురయ్య దొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *